Breaking News
వేంపాడులో విద్యుత్‌ కోతలకు వ్యతిరేకంగా సీపీఎం ధర్నా

పంట పొలాలను కాపాడేందుకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్

  • దేవరకొండ అయుష్‌ 24 న్యూస్‌

వేంపాడు గ్రామంలో విద్యుత్‌ కోతలను నివారించి, రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.తరచూ విద్యుత్‌ కోతలు, లో-వోల్టేజ్‌ సమస్యల కారణంగా పంట పొలాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలను వెంటనే పరిష్కరించి, వ్యవసాయానికి అవసరమైన నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించి పంటలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *