📰 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేద కుటుంబాలకు భరోసా..!
- రూ.67,07,772 విలువగల చెక్కుల పంపిణీ
దేవరకొండ, ఆగస్టు 12: చందంపేట, డిండి మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గారు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందితో కలిసి చెక్కులను పంపిణీ చేశారు.

చందంపేట మండలానికి 59 చెక్కులు, డిండి మండలానికి 8 చెక్కులు చొప్పున మొత్తం 67 చెక్కులను రూ.67,07,772 విలువతో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రధాన ఉద్దేశమని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోందని తెలిపారు.

పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆడబిడ్డల వివాహాలను భారంగా కాకుండా సంతోషకరమైన వేడుకగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
AYUSH 24 NEWS
The Voice of Truth

