📰 కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు ఘాటు కౌంటర్
హైదరాబాద్, ఆగస్టు 12: గాంధీభవన్ (ఇందిరా భవన్)లో నిర్వహించిన “ప్రజలతో ముఖాముఖి” కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పాల్గొని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు.
🔹 కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పండిన వరికి వచ్చిన ధర ఎంత? ఆ వివరాలను తెలంగాణ రైతులకు కూడా కేటీఆర్ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
🔹 అసత్యాలతో కేటీఆర్ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
🔹 భూ కేటాయింపులు నిబంధనల మేరకే జరిగాయని, తమ ప్రభుత్వం ఎకరానికి రూ.1.50 కోట్లు చొప్పున భూమి కేటాయిస్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.90 లక్షలకే ఇచ్చిందని తెలిపారు.
🔹 5 ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు కేటాయించామని, కేటీఆర్ చెబుతున్న రూ.200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు.

🔹 HILT పాలసీ వల్ల హైదరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొంటూ, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం కేటీఆర్‌కు మంచిది కాదన్నారు.
🔹 తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం సరైంది కాదని, ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపించవద్దని సూచించారు.
🔹 బీఆర్ఎస్ చేసిన “గోబెల్స్ ప్రచారాన్ని” ప్రజలు నమ్మలేదని, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించారని మంత్రి వ్యాఖ్యానించారు.
🔹 అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు కొనసాగించిన విధానాలనే తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
🔹 తెలంగాణ నీటి వాటాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందని ఆరోపించారు. తెలంగాణ నీటి వాటాల విషయంలో తాము ఎక్కడా రాజీపడబోమని స్పష్టం చేశారు.
🔹 GRMB సమావేశానికి హాజరై తెలంగాణ ప్రయోజనాల కోసం బలంగా వాదిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
— AYUSH 24 NEWS
The Voice of Truth

