🚨 కూతుర్ని కాపాడి తండ్రి మృతి
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు బోయినపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారం ప్రకారం.. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా బొక్కల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో తండ్రి, కూతురు వాగును దాటే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తు ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో పర్శవేణ రాజు (ఆర్.కే. రాజు) తన కూతురిని కాపాడి, తాను బొక్కల వాగులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
“నాకేమైనా పర్వాలేదు.. నా కూతురు బతకాలి” అనే తండ్రి తపనతో కూతురిని కాపాడిన ఘటన స్థానికులను, కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది.
తండ్రి మృతితో బోయినపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
— AYUSH 24 NEWS
The Voice of Truth

