Breaking News
కుషాయిగూడ బస్ స్టాప్ సమస్యల పరిష్కారానికి అధికారులకు వినతి

సానుకూలంగా స్పందించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్

ఉప్పల్ నియోజకవర్గం, కుషాయిగూడ | AYUSH24 NEWS

కుషాయిగూడ బస్ స్టాప్ వద్ద నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ చలాన్లపై ప్రజల్లో నెలకొన్న ఆందోళన, అలాగే రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల వల్ల బస్సుల రాకపోకలకు ఏర్పడుతున్న ఇబ్బందులపై కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కుషాయిగూడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్లను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బస్ స్టాప్ వద్ద బారికేడ్ల కారణంగా ప్రజలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగులు, ముఖ్యంగా వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ట్రాఫిక్ చలాన్ల అమలులో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను కూడా వివరించారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ, వాటిని సమగ్రంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ డీసీపీ దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు ఇబ్బందులు తొలగేలా వీలైనంత త్వరగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కుషాయిగూడ ప్రజల సమస్యలను గుర్తించి సానుకూలంగా స్పందించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్‌లకు కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఉన్నతాధికారులు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

ఈ కార్యక్రమంలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పనగట్ల చక్రపాణి గౌడ్, చల్లా ప్రభాకర్, కొడకండ్ల యాదయ్య, రేగొండ వెంకటేశ్వర్లు, పండాల గణేష్ గౌడ్, బ్రహ్మచారి, నాలచెరువుల జనార్దన్, పిట్టల రాజు ముదిరాజ్, చినంగిని దయానంద్, రమేష్ చౌదరి, నాగరాజు, సకరామ్ చౌదరి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *