మాలగడ్డ ముత్యాలమ్మ దేవస్థానంలో హుండీ చోరీ
దేవరకొండ: మాలగడ్డ ముత్యాలమ్మ దేవస్థానంలో హుండీ తాళం పగలగొట్టి నగదు అపహరించిన ఘటన కలకలం రేపింది.దేవస్థానంలో జరిగిన చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై దేవస్థాన కమిటీ సభ్యులు దేవరకొండ పోలీస్ స్టేషన్లో సీఐని కలిసి పిటిషన్ సమర్పించారు. ఆలయ హుండీని పగలగొట్టి నగదు చోరీ చేసిన వ్యక్తిపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఆలయ భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.🙏 మాలగడ్డ ముత్యాలమ్మ దేవస్థాన కమిటీ 🙏
📰 AYUSH 24 NEWS
ప్రజల గొంతుక – నిజానికి నిదర్శనం

