Breaking News
మైనంపల్లి గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

మైనంపల్లి | AYUSH24 NEWS

మైనంపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాంసింగ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పుట్టిన ప్రతి శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని, శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వ ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వెంకట్, పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్, అంగన్‌వాడీ టీచర్లు కమలమ్మ, బుజ్జి, ఆయా కళ్ళమ్మ, ఎంఎల్‌హెచ్‌పీ స్వాతి, ఏఎన్‌ఎం విద్యావతి, ఆశా వర్కర్ ధనమ్మ, గ్రామస్థులు పాల్గొన్నారు.

తల్లిపాలపై అవగాహన కల్పిస్తూ, బాలింతలకు ఆరోగ్య సూచనలు అందించారు.

– AYUSH24 NEWS
“ప్రజల గొంతుక – నిజమైన వార్తల వేదిక”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *