శ్రీశైలం పద్మశాలి నిత్య అన్నసత్రం కార్యనిర్వహక అధ్యక్షుడిగా రావిరాల చిన్న వీరయ్య
ఏకగ్రీవంగా ఎన్నిక.. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని హామీ
దేవరకొండ | ఆగస్టు 1 | AYUSH 24 NEWS
దేవరకొండ పట్టణానికి చెందిన రావిరాల చిన్న వీరయ్యను శ్రీశైలం పద్మశాలి నిత్య అన్నసత్రం కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
శుక్రవారం ఎల్బీనగర్లోని పద్మశాలి భవన్లో శ్రీశైలం పద్మశాలి అన్నసత్రాల మార్గదర్శకులు, శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు చిలువేరు కాశీనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. సమావేశంలో జీరపు చంద్రశేఖర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోగా, రావిరాల చిన్న వీరయ్యను కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
గతంలో శ్రీశైలం పద్మశాలి నిత్య అన్నసత్రం ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన రావిరాల చిన్న వీరయ్య, ప్రస్తుతం కార్యనిర్వహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం పట్ల పద్మశాలి సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రావిరాల చిన్న వీరయ్య మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన చిలువేరు కాశీనాథ్, అధ్యక్షుడు జీరపు చంద్రశేఖర్‌తో పాటు కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో, సేవాభావంతో నిర్వహిస్తూ నిత్య అన్నదాన కార్యక్రమాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ నియామకం ద్వారా శ్రీశైలం పద్మశాలి నిత్య అన్నసత్రం సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
📰 AYUSH 24 NEWS
“ప్రజల గొంతుక… నిజాయితీతో వార్తలు.”
#AYUSH24NEWS #Devarakonda #Srisailam #Padmashali #Annadanam #RaviralaChinnaVeeraiah #TelanganaNews

