గొల్లపల్లి గ్రామంలో రూ.15 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ | AYUSH24 NEWS
దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ అన్నారు.
బుధవారం దేవరకొండ మండలం గొల్లపల్లి గ్రామంలో VB-GRAMG నిధుల ద్వారా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేసి, పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే గ్రామంలో ఉన్న రోడ్లు, తాగునీటి సమస్యలు, డ్రైనేజీతో పాటు ఇతర స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామ ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎం.ఏ. సిరాజ్ ఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు లోకసాని శ్రీధర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గండు రవి, ఉపసర్పంచ్ దొంతినేని జానకిరామారావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొర్ర రాంసింగ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, తాటికోల్ సర్పంచ్ చల్లమల విజయ్, పరిసర గ్రామాల సర్పంచులు, జూలూరు గిరి, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గౌని సత్యనారాయణ, సీనియర్ నాయకులు దొంతినేని వెంకటరమణ, వైఎస్ కర్ణాకర్, మాజీ ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– AYUSH24 NEWS
“The Voice of Truth”





