అమెరికా పర్యటనలో పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి (TRR)
–అమెరికన్ తెలుగు సంఘం (ATA) మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే
–ఆగస్టు 12న స్వదేశానికి తిరుగు ప్రయాణం
పరిగి, జూలై 31 (AYUSH24 NEWS):
పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి (TRR) ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు సంఘం (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ మహాసభల్లో ఆయన పాల్గొననున్నారు.
అమెరికా పర్యటన సందర్భంగా రుసుంపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై శ్రీ నరోత్తం రెడ్డి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం.
అమెరికాలోని తెలుగు ప్రవాసులతో సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ముఖ్య సమావేశాలకు ఎమ్మెల్యే హాజరుకానున్నారు.
తన అమెరికా పర్యటనను ముగించుకుని ఆగస్టు 12, 2026న ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి స్వదేశానికి చేరుకోనున్నట్లు సమాచారం.
— AYUSH24 NEWS

