Breaking News
నాయక్ బుడోకాన్ కరాటే అకాడమీలో ఘనంగా బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు

విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు – జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని గణేష్ మాస్టర్ ఆకాంక్ష

హైదరాబాద్, ఆగస్టు 1 (AYUSH24 NEWS ప్రతినిధి):

నాయక్ బుడోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నడేర్గుల్‌లోని గ్రాఫ్ హై స్కూల్ ప్లేగ్రౌండ్ బ్రాంచ్ విద్యార్థులకు లాల్ దర్వాజాలోని సెయింట్ మేరీ హై స్కూల్లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.

ఈ బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు అకాడమీ హెడ్ సెన్సై & హెడ్ ఎగ్జామినర్ గణేష్ నాయక్ పర్యవేక్షణలో నిర్వహించగా, అకాడమీ బ్లాక్ బెల్ట్ కరాటే సెన్సై కె. సలోని పరీక్షలను నిర్వహించారు.

ఈ పరీక్షల్లో మేధాశ్వి మరియు ఖయ్యూమ్ హుస్సేన్ పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తదుపరి బెల్ట్ స్థాయికి అర్హత సాధించారు. పరీక్షలో విద్యార్థుల బేసిక్స్ (Kihon), కటా (Kata), కుమిటే (Kumite), క్రమశిక్షణ (Discipline), స్వీయ రక్షణ (Self Defence) నైపుణ్యాలను సమగ్రంగా పరీక్షించారు.

ఈ సందర్భంగా సెన్సై కె. సలోని మాట్లాడుతూ, విద్యార్థులు ఎంతో కష్టపడి సాధన చేసి ఈ విజయాన్ని సాధించారని అభినందించారు. శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, స్వీయ రక్షణ కోసం మరింత మంది విద్యార్థులు కరాటే శిక్షణలో చేరాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలను అభినందిస్తూ, పిల్లల్లో క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించడంలో కరాటే కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సెయింట్ మేరీ హై స్కూల్ యాజమాన్యానికి అకాడమీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయక్ బుడోకాన్ కరాటే అకాడమీ అధ్యక్షులు గణేష్ మాస్టర్ మాట్లాడుతూ, బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలో పాల్గొని ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థులను పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం చేసిన సెన్సై కె. సలోనిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే కృషితో రాబోయే జాతీయ, అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లకు విద్యార్థులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సూచించారు.

అకాడమీ విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి సంస్థకు, తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని గణేష్ మాస్టర్ ఆకాంక్షించారు.

— AYUSH24 NEWS

“THE VOICE OF TRUTH”

స్వర్గీయ సువర్ణ వనమాల గారి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

దుద్దిళ్ల శ్రీనుబాబుతో కలిసి నివాళులర్పించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్

మంథని, పెద్దపల్లి జిల్లా, జూలై 31 (AYUSH24 NEWS ప్రతినిధి):

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి సహోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య గారి సతీమణి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు గార్ల మేనత్త స్వర్గీయ శ్రీమతి సువర్ణ వనమాల గారి దశదిన కర్మ కార్యక్రమం శుక్రవారం మంథని పట్టణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు గారు స్వర్గీయ శ్రీమతి సువర్ణ వనమాల గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో దుద్దిళ్ల శ్రీనుబాబుతో కలిసి మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ఎల్లే రామ్మూర్తి, కామన్‌పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్.ఎస్. అన్వర్, మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, మాజీ సర్పంచ్ ఎరుకల ఓదెలు, రామగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కండె పోషంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాయకులు స్వర్గీయ శ్రీమతి సువర్ణ వనమాల గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

— AYUSH24 NEWS

“THE VOICE OF TRUTH”

ఈ-కేవైసీ, పేరు మార్పు కోసం ప్రజలపై భారం

రోజుకు 50 మంది పరిమితిని తొలగించి అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ డిమాండ్

వికారాబాద్, జూలై 31 (AYUSH24 NEWS ప్రతినిధి):

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం పక్కన ఉన్న మీసేవ–ఆధార్ కేంద్రంలో ఈ-కేవైసీ, పేరు మార్పు (నేమ్ చేంజ్) తదితర ఆధార్ సేవల కోసం రూ.150 చొప్పున వసూలు చేస్తున్నారని, అలాగే రోజుకు కేవలం 50 మందికి మాత్రమే టోకెన్లు జారీ చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ ఆరోపించారు.

శుక్రవారం కూడా 50 మంది పరిమితి పూర్తయిందని కేంద్రాన్ని మూసివేయడంతో, ఉదయం నుంచే వేచి ఉన్న వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, విద్యార్థులు, కార్మికులు సేవలు పొందకుండా వెనుదిరగాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆర్. మహిపాల్ మాట్లాడుతూ, ఆధార్ సేవల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని, రోజుకు 50 మంది అనే నిబంధనను వెంటనే రద్దు చేసి, ఎక్కువ మందికి సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా, పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వికారాబాద్ జిల్లాలో అదనపు ఆధార్ నమోదు, అప్‌డేట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఈ-కేవైసీ, పేరు మార్పు తదితర సేవల గడువును ప్రభుత్వం పొడిగించాలని కోరారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజల తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

— AYUSH24 NEWS

“THE VOICE OF TRUTH”

చేరిపల్లి శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం

TGUS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం

దేవరకొండ, జూలై 31 (AYUSH24 NEWS):

దేవరకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చేరిపల్లి శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా TGUS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చేరిపల్లి శ్రీనివాస్ గారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ, విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎస్ గోప్యా నాయక్, చీన్యా నాయక్, ఎంఈవో మాతృ నాయక్, TGUS జిల్లా ప్రధాన కార్యదర్శి పంతులాల్, సైదా నాయక్తో పాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు, సంఘ నాయకులు పాల్గొని పదవీ విరమణ పొందిన శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

వక్తలు మాట్లాడుతూ, శ్రీనివాస్ గారు విద్యార్థుల అభ్యున్నతికి, పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా తన అనుభవంతో సమాజానికి, విద్యారంగానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.

— AYUSH24 NEWS

“THE VOICE OF TRUTH”

అమెరికా పర్యటనలో పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి (TRR)

–అమెరికన్ తెలుగు సంఘం (ATA) మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే

–ఆగస్టు 12న స్వదేశానికి తిరుగు ప్రయాణం

పరిగి, జూలై 31 (AYUSH24 NEWS):

పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి (TRR) ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు సంఘం (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ మహాసభల్లో ఆయన పాల్గొననున్నారు.

అమెరికా పర్యటన సందర్భంగా రుసుంపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై శ్రీ నరోత్తం రెడ్డి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం.

అమెరికాలోని తెలుగు ప్రవాసులతో సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ముఖ్య సమావేశాలకు ఎమ్మెల్యే హాజరుకానున్నారు.

తన అమెరికా పర్యటనను ముగించుకుని ఆగస్టు 12, 2026న ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి స్వదేశానికి చేరుకోనున్నట్లు సమాచారం.

— AYUSH24 NEWS

“THE VOICE OF TRUTH”

ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం నిర్వహించిన బీజేపీ నాయకులు

పరిగి మండలంలోని పలు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా పరిశీలన

పరిగి, జూలై 31 (AYUSH24 NEWS):

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమంలో భాగంగా పరిగి మండలంలో విస్తృత స్థాయిలో ఓటరు జాబితా పరిశీలన చేపట్టారు.

మండల ప్రవాస్ అభియాన్‌లో భాగంగా రాఘవపూర్, కుదవానపూర్, సయ్యద్‌పల్లి గ్రామాల్లో బీజేపీ పరిగి మండల అధ్యక్షురాలు శ్రీమతి అనసూయ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో, SIR పరిగి మండల ప్రభారి శ్రీ బండలింటి రామచంద్రయ్య, బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జ్ శ్రీ మారుతి కిరణ్ బూనేటి పార్టీ BLA-2లు మరియు సంబంధిత BLOలతో కలిసి ఓటరు జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నాయకులు సూచించారు. అలాగే ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు, చిరునామా మార్పులు లేదా కొత్త నమోదులు అవసరమైతే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి సవరణలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఓటు అమూల్యమైందని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండటం అత్యంత ముఖ్యమని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పరిగి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ ఉగ్ర నరసింహ, SIR పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జ్ శ్రీ గేరింటి కేశవులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ దోమ రమేష్ కుమార్, శ్రీ నస్కల్ వెంకటయ్య, శ్రీ శ్రీనివాస్, శ్రీ శ్యాంసుందర్, రాఘవపూర్ గ్రామ ఉపసర్పంచ్ రవికుమార్, బీజేపీ యువ నాయకులు శ్రీ మనోహర్ గౌడ్, శ్రీ వివేకానంద, పార్టీ నాయకులు, కార్యకర్తలు, BLA-2లు, BLOలు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

— AYUSH24 NEWS

“THE VOICE OF TRUTH”

పరిగి మైసమ్మ, పోచమ్మ బోనాల జాతర ఏర్పాట్లు

ఉత్సవాలకు ప్రముఖ నాయకులను ఆహ్వానించిన గంగపుత్ర సంఘం బోనాల ఉత్సవ కమిటీ

పరిగి, జూలై 31 (AYUSH24 NEWS):

పరిగి పట్టణంలో నిర్వహించనున్న మైసమ్మ తల్లి, పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవాల సందర్భంగా గంగపుత్ర సంఘం బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ప్రముఖ ప్రజాప్రతినిధులు, నాయకులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఆగస్టు 2, 2026మైసమ్మ తల్లి బోనాల జాతర, ఆగస్టు 3, 2026పోచమ్మ తల్లి తొట్టెల ఊరేగింపు, బోనాల జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, దోమ మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మండల అధ్యక్షులు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నాయకులను గంగపుత్ర సంఘం బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేసి, జాతర కార్యక్రమాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

బోనాల జాతరను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.

— AYUSH24 NEWS

“THE VOICE OF TRUTH”

సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం

ప్రజా సమాచార అధికారికి రూ.5,000 జరిమానా విధించిన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్

హైదరాబాద్, జూలై 31 (AYUSH24 NEWS):

సమాచార హక్కు చట్టం–2005 (RTI Act–2005) అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రజా సమాచార అధికారిపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (SIC) కఠిన చర్యలు తీసుకుంది. చట్టం నిర్దేశించిన గడువులోగా సమాచారాన్ని అందించడంలో విఫలమైన సంబంధిత ప్రజా సమాచార అధికారికి (PIO) రూ.5,000 జరిమానా విధిస్తూ రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీమతి మొహ్సిన్ పర్వీన్ ఆదేశాలు జారీ చేశారు.

సమాచారం ఇవ్వకపోవడంతో అప్పీల్

రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ (DTDO)కు సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసినప్పటికీ, ప్రజా సమాచార అధికారి చట్టబద్ధమైన 30 రోజుల గడువులోగా సమాచారం అందించలేదు. అనంతరం మొదటి అప్పీల్ దాఖలు చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో, సమాచార హక్కు చట్టం నిబంధనల మేరకు ద్వితీయ అప్పీల్ దాఖలైంది.

రాష్ట్ర సమాచార కమిషన్ విచారణ

అప్పీల్ నెం. 3779/SIC-MP/2026పై శుక్రవారం (31-07-2026) హైదరాబాద్‌లోని సమాచార హక్కు భవన్, కోర్టు హాల్–2లో రాష్ట్ర సమాచార కమిషన్ విచారణ చేపట్టింది. ఈ విచారణకు అప్పీలుదారుగా సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర అధ్యక్షులు కాట్రావత్ రాజు నాయక్ స్వయంగా హాజరై తమ వాదనలు వినిపించారు.

కమిషన్ ఆగ్రహం

విచారణ సందర్భంగా ప్రజా సమాచార అధికారి నిర్లక్ష్య ధోరణిపై రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీమతి మొహ్సిన్ పర్వీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సకాలంలో సమాచారాన్ని అందించడం ప్రతి ప్రజా సమాచార అధికారికి చట్టబద్ధమైన బాధ్యత అని, దానిని విస్మరించడం చట్ట ఉల్లంఘనతో సమానమని స్పష్టం చేశారు.

ఎలాంటి సముచిత కారణం లేకుండా సమాచారాన్ని అందించకపోవడం వల్ల దరఖాస్తుదారుడి హక్కుకు భంగం కలిగిందని కమిషన్ అభిప్రాయపడింది. దీంతో సంబంధిత ప్రజా సమాచార అధికారికి రూ.5,000 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వారం రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశం

విధించిన జరిమానా మొత్తాన్ని వారం రోజుల్లోగా చెల్లించాలని, అలాగే అప్పీలుదారు కోరిన పూర్తి సమాచారాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా, మరింత ఆలస్యం చేయకుండా అందజేయాలని కమిషన్ సంబంధిత అధికారిని ఆదేశించింది.

కాట్రావత్ రాజు నాయక్ స్పందన

ఈ సందర్భంగా సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర అధ్యక్షులు కాట్రావత్ రాజు నాయక్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ప్రజలకు పారదర్శక పాలనను అందించే అత్యంత శక్తివంతమైన చట్టమని పేర్కొన్నారు. సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసే లేదా ఆలస్యం చేసే అధికారులపై కమిషన్ కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు.

ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు, సమాచార హక్కు చట్టం సమర్థవంతమైన అమలుకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

పారదర్శక పాలనకు దోహదం

ప్రజలకు చట్టబద్ధంగా సమాచారాన్ని అందించాల్సిన బాధ్యతను విస్మరించే అధికారులపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కఠిన వైఖరిని అవలంబిస్తోందని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేస్తుందని న్యాయ నిపుణులు, సమాచార హక్కు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

— AYUSH24 NEWS

“THE VOICE OF TRUTH”

ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఆదర్శం

ప్రధానోపాధ్యాయులు చేరిపల్లి శ్రీనివాసులు పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ, జూలై 31 (AYUSH24 NEWS):

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ పొందిన శ్రీ చేరిపల్లి శ్రీనివాసులు గారి సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సుదీర్ఘ సేవా కాలంలో వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో శ్రీనివాసులు గారు విశేష కృషి చేశారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, భావితరాలను నిర్మించే గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.

దేవరకొండ జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల పెంపుకు, ఉపాధ్యాయుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడానికి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.

పదవీ విరమణ పొందిన శ్రీ చేరిపల్లి శ్రీనివాసులు గారికి, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పదవీ విరమణ అనంతరం కూడా తన అనుభవంతో సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ-వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, దేవరకొండ చేనేత సహకార సంఘం అధ్యక్షులు చేరిపల్లి బాలరాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

— AYUSH24 NEWS

“THE VOICE OF TRUTH”

బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేరిపల్లి శ్రీనివాసులు పదవీ విరమణ

ఘనంగా సన్మానించిన ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం సభ్యులు

దేవరకొండ టౌన్, జూలై 31 (AYUSH24 NEWS):

దేవరకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చేరిపల్లి శ్రీనివాసులు పదవీ విరమణ చేసిన సందర్భంగా నిర్వహించిన సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ, కార్యదర్శి అంకం చంద్రమౌళి, సహాధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల నారాయణ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, ప్రధానోపాధ్యాయులుగా చేరిపల్లి శ్రీనివాసులు అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

పదవీ విరమణ అనంతరం కూడా తన అనుభవాన్ని ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం అభివృద్ధికి వినియోగించాలని కోరుతూ, సంఘంలో చేరి సేవలు అందించాలని ఆహ్వానించారు.

అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా శ్రీనివాసులు సేవలను ప్రశంసిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

— AYUSH24 NEWS
“THE VOICE OF TRUTH”