Breaking News
ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు శాశ్వత ఆదాయం..

చింతపల్లిలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఎమ్మెల్యే పిలుపు

దేవరకొండ | AYUSH 24 NEWSనల్లగొండ జిల్లా ఉద్యానవన (హార్టికల్చర్) శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా చింతపల్లి మండలం గడియ గౌరారం ఎక్స్ రోడ్ సమీపంలోని రైతు అల్వాల యాదయ్య పొలంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ సంబంధిత అధికారులతో కలిసి ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం అందించే అత్యంత లాభదాయక పంటల్లో ఆయిల్ ఫామ్ ఒకటని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆయిల్ ఫామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తోందని, వంటనూనెల దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడంలో ఈ పంట కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.రైతులకు నాణ్యమైన మొక్కలు, సాంకేతిక సలహాలు, సాగు నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్నామని, నీటి వనరులు ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపితే భవిష్యత్తులో ఆర్థికంగా మరింత బలపడతారని ఎమ్మెల్యే సూచించారు.ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందని ఆయన తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటలకు గిట్టుబాటు ధర, సాగునీటి సౌకర్యాల విస్తరణ, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధితో రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తోందని చెప్పారు.దేవరకొండ నియోజకవర్గంలో వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా రైతులు మరింత లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముచ్చర్ల https://ayush24news.com/The-Voice-of-Truthగిరి, చింతపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జటావత్ హరినాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, ఉద్యానవన శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.✍️ AYUSH 24 NEWS – ప్రజల గొంతుక… నిజమైన వార్తల వేదిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *