పీఏపల్లిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ – ముఖ్య అతిథిగా ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బి. రాథోడ్
AYUSH24 NEWS | దేవరకొండ | 03-08-2026పీఏపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ దుకాణాన్ని ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బి. రాథోడ్ సోమవారం ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆర్.బి. రాథోడ్ మాట్లాడుతూ, వ్యాపారంలో నాణ్యత, నిజాయితీ, వినియోగదారుల నమ్మకమే విజయానికి పునాది అని అన్నారు. వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా వ్యాపారాన్ని నిర్వహిస్తే అభివృద్ధి సహజంగానే వస్తుందని పేర్కొన్నారు.ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు హరిప్రసాద్ ఆర్.బి. రాథోడ్‌తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషాలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆర్.బి. రాథోడ్, సయ్యద్ గౌస్ పాషా హరిప్రసాద్‌ను శాలువాతో సత్కరించి, వ్యాపార అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.అలాగే యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా, స్వయం ఉపాధి మరియు వ్యాపార రంగంలో రాణించి ఆత్మనిర్భరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ కుటుంబ సభ్యులు, చిలుకూరి మహేందర్, ఎన్హెచ్ఆర్సీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బండి నరేష్, తడక మల్ల బిక్షమయ్య, గార్లపాటి శ్రీను, అల్తాఫ్, ఓర్సు వెంకటేష్, ఇబ్రహీం, వెంకటేష్, మహేందర్, వెంకటయ్యతో పాటు నాగార్జున, నాగేష్, అనిల్, అజయ్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.


