పరిగి మైసమ్మ, పోచమ్మ బోనాల జాతర ఏర్పాట్లు
ఉత్సవాలకు ప్రముఖ నాయకులను ఆహ్వానించిన గంగపుత్ర సంఘం బోనాల ఉత్సవ కమిటీ
పరిగి, జూలై 31 (AYUSH24 NEWS):
పరిగి పట్టణంలో నిర్వహించనున్న మైసమ్మ తల్లి, పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవాల సందర్భంగా గంగపుత్ర సంఘం బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ప్రముఖ ప్రజాప్రతినిధులు, నాయకులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
ఆగస్టు 2, 2026న మైసమ్మ తల్లి బోనాల జాతర, ఆగస్టు 3, 2026న పోచమ్మ తల్లి తొట్టెల ఊరేగింపు, బోనాల జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, దోమ మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మండల అధ్యక్షులు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నాయకులను గంగపుత్ర సంఘం బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేసి, జాతర కార్యక్రమాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
బోనాల జాతరను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.
— AYUSH24 NEWS

