ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం నిర్వహించిన బీజేపీ నాయకులు
పరిగి మండలంలోని పలు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా పరిశీలన
పరిగి, జూలై 31 (AYUSH24 NEWS):
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమంలో భాగంగా పరిగి మండలంలో విస్తృత స్థాయిలో ఓటరు జాబితా పరిశీలన చేపట్టారు.
మండల ప్రవాస్ అభియాన్లో భాగంగా రాఘవపూర్, కుదవానపూర్, సయ్యద్పల్లి గ్రామాల్లో బీజేపీ పరిగి మండల అధ్యక్షురాలు శ్రీమతి అనసూయ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో, SIR పరిగి మండల ప్రభారి శ్రీ బండలింటి రామచంద్రయ్య, బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్చార్జ్ శ్రీ మారుతి కిరణ్ బూనేటి పార్టీ BLA-2లు మరియు సంబంధిత BLOలతో కలిసి ఓటరు జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నాయకులు సూచించారు. అలాగే ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు, చిరునామా మార్పులు లేదా కొత్త నమోదులు అవసరమైతే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి సవరణలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఓటు అమూల్యమైందని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండటం అత్యంత ముఖ్యమని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పరిగి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ ఉగ్ర నరసింహ, SIR పరిగి అసెంబ్లీ ఇన్చార్జ్ శ్రీ గేరింటి కేశవులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ దోమ రమేష్ కుమార్, శ్రీ నస్కల్ వెంకటయ్య, శ్రీ శ్రీనివాస్, శ్రీ శ్యాంసుందర్, రాఘవపూర్ గ్రామ ఉపసర్పంచ్ రవికుమార్, బీజేపీ యువ నాయకులు శ్రీ మనోహర్ గౌడ్, శ్రీ వివేకానంద, పార్టీ నాయకులు, కార్యకర్తలు, BLA-2లు, BLOలు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
— AYUSH24 NEWS

