నర్సంపేటకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, AYUSH24 NEWS:
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి నివాళులర్పించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నర్సంపేటకు బయలుదేరారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పనున్నారు.

ఈ సందర్భంగా నర్సంపేటలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటుండటంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.
— AYUSH24 NEWS
THE VOICE OF TRUTH

