ఉప్పల్ తాత్కాలిక బస్టాండ్ వద్ద అధ్వానంగా రోడ్ల దుస్థితి
బురదలో కూరుకుపోయిన సూపర్ లగ్జరీ బస్సు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
ఉప్పల్ | AYUSH24 NEWS
ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాలకు వెళ్లే బస్సుల తాత్కాలిక బస్టాప్ వద్ద రోడ్ల దుస్థితి తీవ్రంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బస్టాండ్ పరిసర ప్రాంతం పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బస్టాప్ వద్ద మట్టి, బురద పేరుకుపోవడంతో ప్రజలు నడవడానికి కూడా వీలు లేకుండా పరిస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు బస్సులు ఎక్కడానికి, దిగడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధ్వానంగా మారిన రహదారి కారణంగా ఓ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు సైతం బురదలో కూరుకుపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. దీంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రజలు, ప్రయాణికులు స్పందిస్తూ బస్టాండ్ పరిసర ప్రాంతంలో వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
– AYUSH24 NEWS
“The Voice of Truth”





