చిన్నారిపై వీధి కుక్కల దాడి బాధాకరం: ఎస్‌కే నవీద్
వీధి కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి
దేవరకొండ | AYUSH24 NEWS:దేవరకొండ 11వ వార్డులో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడం అత్యంత బాధాకరమని 11వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే నవీద్ అన్నారు.వీధి కుక్కల దాడి విషయం తెలుసుకున్న వెంటనే ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. 11వ వార్డులో వీధి కుక్కల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, చిన్నారులు పాఠశాలలకు వెళ్లే సమయంలో, ఇంటి బయట ఆడుకునే సమయంలో కుక్కల వల్ల ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల వీధి కుక్కల దాడిలో గాయపడిన చిన్నారికి ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతోందని తెలిపారు. చిన్నారుల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.వీధి కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్న ప్రాంతాలను గుర్తించి, వాటి నియంత్రణకు మున్సిపల్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌కే నవీద్ కోరారు. ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజల భద్రతే తన ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఎస్‌కే నవీద్, వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.ఎస్‌కే నవీద్11వ వార్డు కౌన్సిలర్, దేవరకొండ– AYUSH24 NEWSప్రజల గొంతుక – నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక







